ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీస్లో హాఫ్ సెంచరీతో రాణించడంతో 705కి పైగా పరుగులు చేశాడు. ఈ జాబితాలో గేల్ (వెస్టిండీస్) 17 మ్యాచ్ల్లో 791 రన్స్ చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. జయవర్ధనే (శ్రీలంక) 22 మ్యాచ్లలో 742 రన్స్ చేసి రెండో స్థానంలో ఉన్నాడు.