18 ఏళ్లకే ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్‌గా నిలిచి తెలుగు కుర్రాడు గుకేశ్ చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు గ్రాండ్‌మాస్టర్ గుకేశ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గుకేశ్ అద్భుతమైన విజయాన్ని దేశం మొత్తం వేడుక చేసుకుంటోందని, భవిష్యత్తులో మరెన్నో విజయాలు, ప్రశంసలు పొందాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.