పాకిస్థాన్‌ను పాకిస్థాన్‌లో మట్టి కరిపించిన బంగ్లాదేశ్ భారత్‌లో మాత్రం చేతులెత్తేసింది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో దారుణ పరాజయం చవిచూసింది. 515 పరుగుల భారీ టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన బంగ్లా 234 పరుగులకు ఆలౌటైంది. దీంతో 280 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అశ్విన్ 6, జడేజా 3 వికెట్లు పడగొట్టారు.