గబ్బాలో జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టుకు వర్షం తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. మ్యాచ్ ఆరంభం అయిన కాసేపటికి మొదలైన వర్షం.. తర్వాత తగ్గుముఖం పట్టడంతో అంపైర్లు తిరిగి ఆటను ప్రారంభించారు. మళ్లీ కాసేపటికే వర్షం పడుతుండడంతో మరోసారి ఆటను నిలిపివేశారు. దీంతో పిచ్ మొత్తం కవర్లతో కప్పి ఉంచారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 28/0 వద్ద బ్యాటింగ్ చేస్తోంది.