వరుసగా 11 వన్డేల్లో ఓటముల తర్వాత వెస్టిండీస్ ఓ సిరీస్ గెలిచింది. సెయింట్ కిట్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో WI 4 వికెట్ల తేడాతో విజయం సాధించి 3 వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. బంగ్లాదేశ్ విధించిన 321 పరుగుల లక్ష్యాన్ని కేవలం 45.5 ఓవర్లలోనే విండీస్ ఛేదించింది. అరంగేట్ర ప్లేయర్లు అమీర్ జాంగూ (104 నాటౌట్), కార్టీ (95) రాణించారు. కాగా సెయింట్ కిట్స్ వేదికలో ఇదే అత్యుత్తమ ఛేదన.