దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ సూపర్-6 మ్యాచ్లో పాక్ నిర్ణీత ఓవర్లలో 171 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు తరఫున ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్(58) అర్థ శతకంతో రాణించగా.. సైమ్ అయూబ్(21), మహ్మద్ నవాజ్(21), ఓ మోస్తరుగా ఆడారు. ఇక భారత బౌలర్లలో శివమ్ దుబే 2, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు. భారత్ విజయ లక్ష్యం 172 రన్స్.