VSP: విశాఖ శ్రీ శారదా పీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర, శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిరోజు శ్రీబాలా త్రిపురసుందరి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ రాజశ్యామల సహిత చండీ యాగం ప్రారంభమైంది.