బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ మూడో టెస్టుకు సిద్ధమవుతోంది. గబ్బా టెస్టు నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ మాట్లాడాడు. తాము తాజాగా సిరీస్‌ను ప్రారంభిస్తామని తెలిపాడు. ఇక నుంచి మూడు టెస్టుల సిరీస్‌గా భావించి ఆడతామని పేర్కొన్నాడు. గబ్బాలో తాము మెరుగైన ఆటతీరు ప్రదర్శించిన చరిత్ర ఉందని వెల్లడించాడు.