సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలో మధ్యప్రదేశ్ ఘన విజయం సాధించింది. బెంగళూరు వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో మధ్యప్రదేశ్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. కేవలం 15.4 ఓవర్లలోనే మధ్యప్రదేశ్ బ్యాటర్లు లక్ష్యాన్ని ఛేదించారు. అంతకుముందు నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ.. 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.