రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లోనే ఆటకు వీడ్కోలు పలికాడు. కాగా, గతంలోనూ ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్ ఆడిన తర్వాతనే పలువురు క్రికెటర్లు.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అందులో అనిల్ కుంబ్లే, గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, ధోనీ ఉన్నారు.