తమ ఆటతో అందరినీ అలరిస్తామని, ఆ విషయంలో వెనుకడుగు వేయమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు ముందు ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌తో భారత జట్టు రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్ కోసం కాన్‌బెర్రాకు వెళ్లిన టీమిండియాకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ ప్రత్యేక విందు ఇచ్చారు. ఆసిస్ ప్రధాని, భారత ఆటగాళ్ల మధ్య సరదా సంభాషణ జరిగింది.