మహారాష్ట్ర సీఎం పీఠంపై సస్పెన్స్ వీడలేదు. మహాయుతి నేతలు షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌తో కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా సమావేశమయ్యారు. ఢిల్లీలో ఈ సమావేశం సుమారు 2 గంటలపాటు జరిగింది. ఈ సమావేశంలోనే మహారాష్ట్ర సీఎం ఎంపికపై, డిప్యూటీ సీఎంలు ఎవరనేది నిర్ణయిస్తారని ప్రచారం జరిగింది. మినిస్టర్ బెర్తులు ఏ పార్టీకి ఎన్ని కేటాయించాలనేదానిపై నిర్ణయానికి వస్తారని, పవర్ షేరింగ్‌పై డిస్కషన్ ఉంటుందని సమాచారం.