TG: రాష్ట్రంలోని పాఠశాలల్లో జరుగుతున్న వరుస పుడ్ పాయిజన్ ఘటనలపై సర్కార్ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు ప్రభుత్వ పాఠశాలల బంద్కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో వరుసగా పుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి, రాష్ట్ర కార్యదర్శి నాగరాజు ప్రకటనలో తెలిపారు.