పనులు పూర్తి చేయట్లేదని ఛత్తీస్‌గఢ్‌లోని సజ్బహార్ సర్పంచి సోనమ్ లక్రాను గతంలో ఉన్నతాధికారులు తొలగించారు. దీన్ని సవాల్ చేస్తూ మహిళా సర్పంచి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. విచారించిన ధర్మాసనం అధికారుల తీరుపై మండిపడింది. ఈ చర్యలు వలసవాద మనస్తత్వాన్ని చాటుతున్నాయని పేర్కొంటూ.. ఆమెను సర్పంచిగా పునర్నియమించడంతో పాటు రూ.లక్ష చెల్లించాలని సుప్రీం ఆదేశించింది. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాలని సూచించింది.