TG: సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా కేసులో నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేశారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్.. బీజేపీపై తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 11కు వాయిదా వేసింది.