AP: టిడ్కో ఇళ్లలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. 2019-24 మధ్య టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల జాబితా మార్చివేత ఆరోపణలపై విచారణ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. 2017-19లో ఎంపిక చేసిన లబ్ధిదారులను మార్చేసి 2019-24లో కొత్తవారిని జాబితాలో చేర్చడంపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కాగా.. ఈ వ్యవహారంపై విచారణ చేయిస్తామని మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే.