మరికాసేపట్లో కేంద్రమంత్రి అమిత్ షాను మహాయుతి అగ్రనేతలు దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్నాథ్ శిందే, అజిత్ పవార్ కలువనున్నారు. ఈ భేటీలో మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరు అన్న దానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే సీఎం పీఠాన్ని బీజేపీకి చెందిన వ్యక్తికే ఇవ్వాలని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్ల తెలుస్తోంది. ఈ మేరకు ఏక్నాథ్ శిందేను ఒప్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం.