TG: కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ప్రస్తుతం అక్కడ ఉన్న ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ ఆదేశించింది. అప్‌గ్రేడ్ చేయాలని గతేడాది జూలై 5న దక్షిణ మధ్యరైల్వే జీఎంకి రైల్వే బోర్డు లేఖ రాసిన విషయం తెలిసిందే. విభజన హామీల అమలుపై తెలంగాణ అధికారులు, కేంద్ర అధికారులతో హోంశాఖ నిర్వహించిన భేటీలో ఈ విషయం వెల్లడైంది.