డిసెంబర్ నెలలో కొన్ని ఆర్థిక అంశాలకు సంబంధించిన గడువులు ముగియనున్నాయి. ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు డిసెంబర్ 14తో ముగియనుంది. యాక్సిస్ బ్యాంక్.. కొన్ని క్రెడిట్ కార్డులపై ఫైనాన్స్ ఛార్జీలను 3.6 శాతం నుంచి 3.75 శాతానికి పెంచింది. అలాగే, గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) సంబంధించి రిటర్నులు దాఖలు చేయకపోయి ఉంటే.. డిసెంబర్ 31లోపు బిలేటెడ్ రిటర్నులు చెల్లించొచ్చు.