ప్లేస్టోర్‌లో రియల్ మనీ గేమింగ్ యాప్‌ల లిస్టింగ్ విషయంలో తప్పుడు విధానాలను అనుసరించారంటూ గూగుల్‌తో పాటు దాని అనుబంధ సంస్థలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. సీసీఐ చట్టంలోని నిబంధనల ప్రకారం దర్యాప్తు చేపట్టాలని డైరెక్టర్ జనరల్‌కు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 60 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి నివేదికను అందించాలని సూచించింది.