TG: లగచర్ల ఘటన నేపథ్యంలో పోలీస్‌శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దుద్యాలలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో కొత్త పీఎస్ పరిధిలోకి ఆందోళన జరుగుతున్న 7 గ్రామాలు రానున్నాయి. కాగా.. ఇటీవల వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ బృందంపై రైతులు, గ్రామస్థులు దాడి చేసిన విషయం తెలిసిందే.