TG: మంత్రి కొండా సురేఖపై కేసు నమోదైంది. BNS 356 కింద ప్రజాప్రతినిధుల కోర్టు ఆమెపై కేసు నమోదు చేసింది. డిసెంబర్ 12న వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. హీరో నాగార్జున పిటిషన్ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కాగా, మంత్రి సురేఖ వ్యాఖ్యలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.