జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి తన ఫ్లాగ్షిప్ SUV Q7 కారును అందుబాటులోకి తెచ్చింది. ఈ కారు రూ.88.66 లక్షల నుంచి రూ.97.81 (ఎక్స్‌షోరూమ్) లక్షలకు లభించనుంది. 3.0 లీటర్ల V6 టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో తయారైన ఈ మోడల్లో 8-స్పీడ్ గేర్‌బాక్స్, 5.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు గంటకు 250 కిలోమీటర్లు ప్రయాణించనుంది.