TG: CM రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా-2026 పోటీలను HYDలో నిర్వహించేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. వచ్చే ఏడాది నిర్వహించేలా CM విజ్ఞప్తి చేసినా 2025లో బీహార్‌లో నిర్వహించేలా ఇప్పటికే నిర్ణయం జరగడంతో 2026లో HYDలో నిర్వహించేందుకు కేంద్ర క్రీడలశాఖ మంత్రి సానుకూలంగా స్పందించి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డికి హామీ ఇచ్చారు.