చైనాలోని అతిపెద్ద ఎడారుల్లో ‘తక్లీ మాకన్’ ఒకటి. చైనా ప్రభుత్వం ఈ ఎడారి చుట్టూ దాదాపు 3,046 కి.మీ ఇసుక తిన్నెల ఏరియాను పచ్చదనంలోకి మార్చింది. ప్రపంచంలోనే అత్యధిక విస్తీర్ణంలో ఎడారిని అడవిగా మార్చిన ఘనత చైనా సొంతం చేసుకుంది. ‘తక్లీ మాకన్’ ఎడారిని అడవిగా మార్చే ప్రాజెక్టును 1978లో చైనా ప్రారంభించింది. ఇప్పటివరకు ఈ ఎడారి మధ్యలోనున్న 3.2 కోట్ల హెక్టార్లను అడవిగా మార్చారు. 2050 నాటికి పచ్చదనంతో నింపేయాలని చైనా లక్ష్యం.