సెంట్రల్ యూనివర్సిటీల్లో 5 వేల టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఉద్యోగ విరమణ, రాజీనామాల వల్ల ఖాళీలు ఏర్పడ్డాయని, ఖాళీల భర్తీ ఆయా వర్సిటీలదే అని పేర్కొంది. ఉద్యోగాల భర్తీకి UGC 2023లో CU-Chayan Portalను ప్రవేశపెట్టిందన్నారు. విద్యార్హతల ఆధారంగా ఈ పోర్టల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.