RCB తమ నూతన సారథిగా టీమిండియా బ్యాటర్ రజత్ పటీదార్‌ను ఎంపిక చేసింది. అయితే పటీదార్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడాన్ని విరాట్ కోహ్లీ సమర్థించాడు. దేశవాళీలో మధ్యప్రదేశ్ జట్టును అతను అద్భుతంగా నడిపించాడని, RCBని నడిపించే నైపుణ్యం పటీదార్‌కు ఉందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. కాగా గతంలో కోహ్లీ అనంతరం డుప్లెసిస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.