ఈనెల 14 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టులో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ ద్వారా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. ఒకవేళ అతడు సెంచరీ చేస్తే.. ఆస్ట్రేలియాలోని ప్రధాన 5 వేదికల్లో శతకాలు బాదిన మూడో పర్యాటక జట్టు ఆటగాడిగా చరిత్రకెక్కుతాడు. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఈ రికార్డును గవాస్కర్, కుక్ మాత్రమే అందుకున్నారు.