టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత్ పేసర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికాతో బుధవారం జరిగిన మూడో టీ20లో మూడు వికెట్లు తీయడం ద్వారా అర్ష్‌దీప్ సింగ్ ఈ ఫీట్ సాధించాడు. మొత్తం 92 వికెట్లతో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో భువనేశ్వర్ (90 వికెట్లు), జస్ప్రీత్ బుమ్రా(89 వికెట్లను)ను అధిగమించాడు.