ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం సాధించాడు. కేవలం 24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ కూడా (43 పరుగులు) హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. వీరిద్దరూ కలిసి 8.4 ఓవర్లలోనే 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.