ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తాజాగా ఓ ఇంటర్య్వూలో సచిన్ టెండుల్కర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘సచిన్ ఆట అంటే నాకు చాలా ఇష్టం. 2004లో భారత్Vs ఆస్ట్రేలియా జరిగిన తొలి ఇన్నింగ్స్లో సచిన్ డబుల్ సెంచరీ(436 బంతుల్లో 33ఫోర్ల)తో రాణించిన ఈ ఇన్నింగ్స్ నా జీవితంలో మర్చిపోలేను. తొలి ఇన్నింగ్స్ మొత్తంలో ఒక్క కవర్ డ్రైవ్ షాట్ కూడా కొట్టకుండా మెరుపుదాడి చేశాడు’ అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.