టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ బంగ్లాదేశ్తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో 124 బంతుల్లోనే తన ఆరో సెంచరీని సాధించాడు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో ధోనీ కంటే పంత్ బెటర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. వీటిపై తాజాగా దినేశ్ కార్తిక్ స్పందించారు. వారిద్దరిని పోల్చడం సరైంది కాదని.. ఇంకాస్త సమయం ఇవ్వాలంటూ డీకే అభిప్రాయపడ్డాడు.