బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా విజయంలో అశ్విన్, జడేజా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జడేజా గురించి అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘జడేజాది చాలా స్ఫూర్తిదాయకమైన జీవితం. అతను బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు డ్రెస్సింగ్ రూంలో నేను చాలా ప్రశాంతంగా ఉండేవాడిని. జడేజా బ్యాటుతో, బంతితో బెంబేలెత్తించగలడు. ఫీల్డింగ్‌లో చురుగ్గా ఉంటాడు. అందుకే అతడంటే అసూయ. అలాగే అభిమానిస్తాను కూడా” అని అన్నాడు.