చెస్ ఒలింపియాడ్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. బుడాపెస్ట్ వేదికగా జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో భారత్ రెండు స్వర్ణాలతో అదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత్ స్వర్ణాలు గెలవడం ఇదే తొలిసారి. 2014, 2022లో పురుషుల జట్టు, 2022లో మహిళల జట్టు కాంస్యాలు గెలవడమే అత్యుత్తమ ప్రదర్శన. కాగా, 45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల చెస్ జట్లు పసిడి సాధించి.. అదరగొట్టాయి.