Gianluca Conte లైఫ్ మార్చేసిన పాస్తా.. ఏం జరిగిందంటే..?
అమెరికాకు చెందిన జియాన్ లుకా కాంటే చదువు పూర్తయ్యింది. చేసే జాబ్ మీద శాటిస్ఫై కాలేదు. ఇంటికి వచ్చిన వెంటనే చిరాకు పడేవాడు. అలా పాస్తా చేస్తూ.. వీడియోలు తీసేవాడు. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.
Gianluca Conte: రోజులు మారాయి. అంతా ఈజీగా లక్షాధికారులు కావాలని అనుకుంటున్నారు. పెద్దగా కష్టపడకుండానే కార్లు, బంగాళాలు ఉండాలని చూస్తున్నారు. ఓ అమెరికన్ కూడా అంతే.. చేస్తున్న జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు. నెల రోజులు కష్టపడితే కొద్ది మొత్తం రావడం.. ఖర్చులు, ఈఎంఐలకు కట్ కావడంతో ఏమీ అర్థం కాలేదు. ఏదో టైమ్ పాస్‌కి చేసిన దాంతో ఫేమస్ అయిపోయాడు.. ఇంతకీ అతను ఏం చేశాడంటే..
పాస్తా ప్రిపేర్
ఇంటికొచ్చి చిరాకుగా ఉండటంతో పాస్తా ప్రిపేర్ చేశాడు జియాన్ లుకా కాంటే. నెలరోజుల సంపాదన రెండురోజుల్లో అయిపోవడంతో ఫుడ్ ప్రిపేర్ చేసేవాడు. అలా అతని ఒత్తిడి తగ్గింది. రిలాక్స్ అయ్యాడు. తర్వాత వీడియో తీస్తూ.. సోషల్ మీడియాలో షేర్ చేసేవాడు. దానిని అలవాటుగా మార్చుకున్నాడు. అదే అతని లక్‌గా మారింది. అవును.. ఆ వీడియోలు వైరల్ అవడంతో రాత్రికి రాత్రే జియాన్ ఫేమస్ అయ్యాడు.
జాబ్ చేసి..
అందిరిలాగే జియాన్ కూడా చదివాడు. తర్వాత జాబ్ చేసేవాడు. అతనికి ఉన్న ఖర్చులకు ఆ జీతం సరిపోయేది కాదు.. దట్ టు.. రెండు, మూడురోజుల్లోనే అయిపోయేది. ఇంటికొచ్చి.. చిరాకుగా ఉండేవాడు. పాస్తా చేసుకుని తినేవాడు. అలా వీడియోలు తీసుకుంటూ.. షేర్ చేయగా చేయగా.. ఒక రోజు పాస్తా వీడియోకు తెగ లైకులు వచ్చాయి. కామెంట్ల వర్షం కురిసింది. వేలల్లో షేర్ చేశారు. ఇంకేముంది అతను ఒక్కసారిగా సోషల్ మీడియా స్టార్ అయిపోయాడు. తర్వాత వివిధ రకాల పాస్తా చేస్తూ తీసిన వీడియోలను అప్ లోడ్ చేసేవాడు. వాటి రీచ్ కూడా ఎక్కువగా వచ్చింది.
డిఫరెంట్ పాస్తా
ఇంకేముంది టమాట ఛీజ్, ఛీజ్, మఘ్రూమ్ పాస్తా అంటూ రకరకాల పాస్తాలు చేశాడు. ఆ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో జియాన్ జాబ్ వదిలేశాడు. వీడియోలు చేస్తూ.. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. అతని మాటతీరు బాగుండటంతో తమ కంపెనీల కోసం పనిచేయాలని స్పాన్సర్ షిప్స్ వచ్చాయి. అలా అతను మిలియనీర్ అయిపోయాడు. ఇప్పుడు కూడా వంటలు చేస్తూ.. ప్రోగ్రామ్స్ చేస్తూ చక్కగా సంపాదిస్తున్నాడు. ఇప్పుడు అతనికి ఆర్థికంగా ఏ దిగులు లేదు.
హీరో
జియాన్ వీడియో చూసి నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇష్టమైన ప్రొఫెషన్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదని.. ఫెయిల్ అనే మాట ఉండదని చెబుతున్నారు. ఇష్టంగా చేస్తారని.. అలా కలిసి వస్తోందని చెబుతున్నారు. నిజమే.. జియాన్‌కు అలా లక్ కలిసి వచ్చింది. అతను కానీ పాస్తా చేయకున్నా.. వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయకున్నా ఈ రోజు ఓ ఎంప్లాయ్ గానే ఉండేవాడు. కానీ అతని అభిరుచి మాత్రం ఈ రోజు హీరోను చేసింది. సో.. అభిరుచి మేరకు నడుచుకొండి, ఇష్టమైన కెరీర్.. ఏదైనా సరే, కుకింగ్, ఫోటోగ్రఫీ, ఆర్టిస్ట్‌గా ట్రై చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. దాంతో మీలో ఉన్న సత్తా బయటకు వస్తోందని.. మిమ్మల్నీ ఆపే వారు ఉండరని చెబుుతున్నారు.