»Modi Adani Slogans Raised As Pm Replies To Motion Of Thanks
Narendra Modi: మీరు విసిరే బురద నుండి కమలం
ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలన శుద్ధ దండగ అని, ప్రతిపక్షాలు విసిరే బురదలోనూ కమలం వికసిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో వ్యాఖ్యానించారు. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ పాలనపై ఆయన నిప్పులు చెరిగారు.
ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలన శుద్ధ దండగ అని, ప్రతిపక్షాలు విసిరే బురదలోనూ కమలం వికసిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) పార్లమెంటులో వ్యాఖ్యానించారు. రాజ్యసభలో కాంగ్రెస్ (Congress) పార్టీ పాలనపై ఆయన నిప్పులు చెరిగారు. దేశ ప్రగతిని కాంగ్రెస్ తీవ్రంగా నాశనం చేసిందన్నారు. యూపీఏ (UPA) పని తీరును తాను నిశితంగా గమనించానని, ఇతర దేశాలు ఆ సమయంలో అభివృద్ధి చెందితే, భారత్‌ను మాత్రం కాంగ్రెస్ వెనుకబడేసిందన్నారు. యూపీఏ ఏ సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం ఆలోచించలేదన్నారు. కానీ ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించామన్నారు. పరిష్కారం చూపించడంలో బీజేపీ ముందు నిలిచిందన్నారు. దీర్ఘకాలిక సమస్యలను వరుసగా పరిష్కారిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ సమస్యలపై పైపూత పూస్తే, తాము పూర్తిగా మానేలా చేస్తున్నట్లు చెప్పారు. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నిరాకరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ కాలంలో జనం డబ్బులు మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లాయన్నారు. గరీబీ హటావో అనేది కాంగ్రెస్ పార్టీకి కేవలం నినాదం మాత్రమేనని ఎద్దేవా చేశారు. తాము దేశ ప్రజల కోసం రాత్రి, పగలు కష్టపడుతున్నామన్నారు.
కొందరు ఎంపీల ప్రవర్త చూస్తుంటే బాధ కలిగిస్తోందన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకు దేశ ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చారని, కానీ అదే ప్రజల్ని ఆ పార్టీ వంచించిందన్నారు. మేం మా పాలన ద్వారా ప్రజల నమ్మకాన్ని పొందామని చెప్పారు. తాను ఎప్పుడు కూడా రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేయలేదన్నారు. దేశం కోసం మాత్రమే ఆలోచించామన్నారు. సాంకేతిక సాయంతో ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. తాము నిజమైన లౌకికవాదాన్ని అనుసరిస్తున్నామని స్పష్టం చేశారు. మేం వికాసాన్ని మాత్రమే నమ్ముతున్నామని, విపక్షాలను కాదన్నారు. పేదలను కూడా బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వాములను చేశామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 18వేల గ్రామాలకు కరెంట్ ఇచ్చి వెలుగులు నింపినట్లు చెప్పారు. అరవై ఏళ్లుగా కాంగ్రెస్ గుంతలు తవ్వితే, తాము తమ పథకాలతో దేశ గతిని మార్చామన్నారు. కాంగ్రెస్ తన పాపాలకు శిక్ష అనుభవిస్తోందన్నారు. దశాబ్దాలుగా ఆదివాసీలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తే, వారికి లక్షా ఇరవై వేల కోట్ల బడ్జెట్ కేటాయించామన్నారు. మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేశామన్నారు. చిన్న, సన్న కారు రైతులు లేనిదే దేశ ప్రగతి లేదని, అందుకే వారికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
మోడీ ప్రసంగిస్తుండగా విపక్షాలు నిరసన తెలిపాయి. అదానీ (Adani) వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేసాయి. విపక్షాల నిరసనల మధ్య ఆయన ప్రసంగం కొనసాగించారు. ఎంపీలు మోడీ, అదానీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకు వచ్చి నినాదాలు చేశారు.