»If You Prove That You Have Invested Movies The Entire Property Will Be Written Off Balineni
Balineni : మూవీస్ కి పెట్టుబడి పెట్టినట్టు నిరూపిస్తే ఆస్తి మొత్తం రాసిస్తా : బాలినేని
వీరసింహారెడ్డి (Veerasimha Reddy) ఆడియో ఫంక్షన్ కి ఒంగోలులో పర్మిషన్ వస్తే ఆ సినిమాకి తాను పెట్టుబడి పెట్టినట్లు అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఏ సినిమాకైనా తాను, తన వియ్యంకుడు పెట్టుబడి పెట్టానని నిరూపిస్తే రాజకియాల నుంచి తప్పుకుంటానని చెప్పారు.
ఆరోపణలను రుజువు చేస్తే తన ఆస్తి మొత్తం రాసిస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) అన్నారు.జనసేన నాయకుడు మూర్తి మతిపోయి మాట్లాడుతున్నాడని బాలినేని అన్నారు.తన వియ్యంకుడు వైజాగ్ (Vizag) లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే తనకు సంబంధమేంటని ప్రశ్నించారు. మైత్రి మూవీస్(Mythri Movies) కి తాము పెట్టుబడి పెట్టినట్టు నిరూపిస్తే తన ఆస్తులు రాసిచ్చి రాజకీయాల నుంచి తప్పకుంటానని పవన్ కల్యాణ్ ను సూటిగా ప్రశ్నించారు.రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని సవాల్ చేశారు. తమపై దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.
వీరసింహారెడ్డి ఆడియో ఫంక్షన్ కి ఒంగోలులో పర్మిషన్ వస్తే ఆ సినిమాకి తాను పెట్టుబడి పెట్టినట్లు అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలతో తన మీదికి ఇన్కాంటాక్స్ (Income tax) ఉసిగొల్పాలని చూస్తున్నారని ఆరోపించారు. తానేంటో జిల్లా ప్రజాలకు తెలుసన్నారు. పదే పదే అసత్యాలు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. 2002లో కొన్న స్థలానికి ఇప్పుడు కొన్నట్టు లింక్ పెడుతున్నారని అన్నారు.తనపై అసత్య ప్రచారం చేస్తున్న పత్రికపై 10 కోట్ల రూపాయల పరువునష్టం దావా వేస్తానని చెప్పారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) తన నాయకులను అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. మైత్రి మూవీస్ లో పెట్టుబడి పెట్టిన తెలుగుదేశం ఎమ్మెల్యే ని వదిలేసి తన మీద అబాండాలు వేస్తున్నారని మండిపడ్డారు.