కేంద్ర ప్రభుత్వం భారత్లో మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ పెన్సిలిన్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. 1990లోనే దేశంలో ఉత్పత్తిని ఆపేసిన తర్వాత మళ్లీ తొలిసారిగా పెన్సిలిన్ ఉత్పత్తి ప్లాంట్ను ప్రారంభించింది. కాకినాడ జిల్లాలో అరబిందో ఫార్మా కంపెనీ నిర్మించిన లైఫియస్ ఫార్మా ప్లాంట్ను ప్రధాని మోదీ నిన్న వర్చువల్గా ప్రారంభించారు. ఈ ప్లాంట్లో పెన్సిలిన్-జీని ఉత్పత్తి చేయనున్నారు.