AP: సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ వెనక జగన్, భారతి, సజ్జల ఉన్నారని వైఎస్ షర్మిల వెల్లడించారు. వీళ్లంతా ఓ రాక్షస ముఠాను తయారు చేసి తనపై ట్రోల్స్ చేయిస్తున్నారని తెలిపారు. ఆఖరికి రాజశేఖర్ రెడ్డి భార్యను కూడా అవమానించే స్థాయికి దిగజారారన్నారు. వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లకు తోడుగా ఉన్నాను. కానీ ఇప్పుడు తనను, తన కుటుంబాన్ని పక్కన పెట్టారని, కనీసం చెల్లెలుగా కూడా చూడటం లేదని షర్మిల పేర్కొన్నారు.