దానా తీవ్ర తుపాను భితర్కనికా-ధమ్రా సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఒడిస్సా ప్రభుత్వం అప్రమత్తమయింది. తీర ప్రాంతంలోని సుమారు 3 లక్షల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సీఎం మోహన్ చరణ్ వెల్లడించారు. 7000 పునరావాస కేంద్రాలను, NDRF,ODRF బలగాలను సిద్ధం చేశామన్నారు. ఈ రోజు అర్ధరాత్రి తరువాత ‘దానా’ తీరం దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు.