కేంద్ర మంత్రి జైశంకర్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. చేపల వేటకు వెళ్లి.. శ్రీలంక నేవీకి చిక్కిన 16 మంది తమిళనాడుకు చెందిన మత్స్యకారులను విడిపించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రామేశ్వరానికి చెందిన మత్స్యకారులు బుధవారం వేటకు వెళ్లిన వారిని శ్రీలంక నేవీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో వారిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌కు సీఎం స్టాలిన్ లేఖ రాశారు.