TG: సీఎం రేవంత్ మాటలు నమ్మే పరిస్థితి లేదని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకూ వర్గీకరణ చేస్తామని సీఎం అన్నారని.. కానీ, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను రేవంత్ మరిచారని అన్నారు. ‘వర్గీకరణ అమలు చేయకుండానే టీచర్ పోస్టులు భర్తీ చేశారు. గ్రూపు-1 పోస్టులకూ వర్గీకరణ వర్తింపజేయాలి. వర్గీకరణ తర్వాతే గ్రూపు-1 మెయిన్స్, గ్రూపు-2, గ్రూపు-3 పరీక్షలు నిర్వహించాలి’ అని డిమాండ్ చేశారు.