TG: జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో దారుణం జరిగింది. ఆస్తి తగాదా విషయంలో పెద్దల మాట వినలేదని సోమయ్య కుటుంబంపై కుల బహిష్కరణ వేటు వేశారు. సోమయ్య తల్లి మృతి చెందడంతో అంత్యక్రియలకు కులస్తులను వెళ్లవద్దని హుకూం జారీ చేశారు. దీంతో సోమయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.