యూపీలోని 9 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరగనున్న స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించబోమని కాంగ్రెస్ ప్రకటించింది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులకు మద్దతిస్తున్నట్లు వెల్లడించింది.