Vijayawada: అల్లుడి చేతిలో దారుణ హత్యకు గురైన అత్త
కూతురుని కాపురానికి పంపకుండా విడాకుల కోసం కోర్టులో కేసు వేసిందన్న కోపంతో విజయవాడలో ఓ వ్యక్తి తన అత్తను దారుణంగా హతమార్చాడు. విజయవాడలో నగర శివారులోని చనమోలు వెంకటరావు ఫ్లైఓవర్ సమీపంలోని ఫుట్‌పాత్‌పై జరిగింది. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Vijayawada: కూతురుని కాపురానికి పంపకుండా విడాకుల కోసం కోర్టులో కేసు వేసిందన్న కోపంతో విజయవాడలో ఓ వ్యక్తి తన అత్తను దారుణంగా హతమార్చాడు. విజయవాడలో నగర శివారులోని చనమోలు వెంకటరావు ఫ్లైఓవర్ సమీపంలోని ఫుట్‌పాత్‌పై జరిగింది. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అత్తమామలిద్దరినీ చంపాలనుకున్న అల్లుడి దాడి నుంచి మామ త్రుటిలో తప్పించుకోగా.. అత్త అల్లుడి కత్తికి బలైంది. జక్కంపూడి జేఎన్ఎన్యూ ఆర్ఎం కాలనీకి చెందిన గోగుల నాగమణి రెండో కుమార్తెకి తన భర్తతో విబేధాలు రావడంతో కోర్టులో కేసు నడుస్తోంది. దీంతో అల్లుడు రాజేష్ అత్తమామలపై కక్ష పెంచుకున్నాడు. వాళ్లని హతమార్చాలని టైం కోసం వెయిట్ చేశాడు. 0పథకం ప్రకారం మాట్లాడేందుకు ఫ్లైఓవర్ ప్రాంతానికి పిలిపించాడు. వారు రాగానే ద్విచక్రవాహనంపై మామను నరికి చంపేందుకు ప్రయత్నించగా అతడు పరారయ్యాడు. అత్త అక్కడి నుంచి వెళ్లలేక పోయింది. దీంతో రాజేశ్ అత్తపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నాగమణి అక్కడికక్కడే మృతి చెందింది. అత్త చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యారు. టూటౌన్ కొత్తపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అసలు కారణం..
గోగుల గురుస్వామి, నాగమణి దంపతులు వైఎస్ఆర్ కాలనీ బ్లాక్ నంబర్ 68లో నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు ఝాన్సీ పాల ఫ్యాక్టరీ సమీపంలో ఉంటోంది. రెండో కుమార్తె లలిత తన భర్త కుంభా రాజేష్‌తో కలిసి కబేలా సమీపంలోని ఏకలవ్య నగర్లో నివసించేది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సమీపంలోని ఈట్ స్ట్రీట్‌లో రాజేష్ పనిచేసేవాడు. గత కొంతకాలంగా రాజేష్, లలిత మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. ఈ కేసు కోర్టులో తుది విచారణలో ఉంది. వివాదాల కారణంగా లలిత వైఎస్ఆర్ కాలనీలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. దీంతో అత్త, మామలపై రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గత కొన్ని రోజులుగా వారిని చంపేందుకు ప్రయత్నిస్తున్నాడు. శనివారం రాత్రి అదును చూసి దాడి చేశాడు.