»Russia Ukraine Conflict Wagner Head Says Group Standing Down After Claims Of Deal
Russia: వాగ్నర్ గ్రూప్, రష్యా మధ్య ఒప్పందం..తిరిగి వస్తున్న యోధులు
రష్యాలో వాగ్నర్ తిరుగుబాటు తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. మాస్కోలో ఎమర్జెన్సీ విధించారు. అక్కడి ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. మాస్కోలో సోమవారాన్ని 'నాన్ వర్కింగ్ డే'గా ప్రకటించారు.
Russia: రష్యాలో తిరుగుబాటు యుద్ధం మొదలైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వ్యతిరేకంగా వాగ్నర్ గ్రూప్ ముందుంది. దీంతో మాస్కోలో ఉద్రిక్తత పెరిగింది. వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు తర్వాత రష్యాలో ఎమర్జెన్సీని ప్రకటించారు. అయితే ఇప్పుడు దాదాపు 12 గంటల తర్వాత వాగ్నర్ గ్రూప్-రష్యా ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరిందని వార్తలు వచ్చాయి. ఈ ఒప్పందం తరువాత, వాగ్నెర్ యోధులు ఉక్రెయిన్‌కు తిరిగి రావడం ప్రారంభించారు.
బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో ఈ ఒప్పందాన్ని తీసుకురావడంలో పెద్దన్న పాత్ర పోషించారు. వాగ్నర్‌తో ఒప్పందం ముసాయిదా సిద్ధమైందని ఆయన పేర్కొన్నారు. ప్రిగోగిన్, రష్యా ప్రభుత్వం మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీంతో వాగ్నర్ సైనికులు తిరిగి వస్తున్నారు. లుకాషెంకో వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోగిన్తో మాట్లాడి రష్యాపై దాడిని ఆపమని అభ్యర్థించారు. వాగ్నర్ సైన్యానికి భద్రతపై అధ్యక్షుడు పుతిన్ హామీ ఇచ్చారని లుకాషెంకో తెలిపారు. మరోవైపు, వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్, వాగ్నెర్ ఫైటర్లను ఉక్రెయిన్‌కు తిరిగి రావాలని ఆదేశిస్తూ టెలిగ్రామ్‌లో ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. వాగ్నర్ సైన్యం మళ్లీ యుద్ధభూమికి తిరిగి రావాలని అతను చెప్పాడు.
⚡️⚡️⚡️ President of #Belarus#Lukashenko held talks w/ head of PMC Wagner #Prigozhin. Negotiations continued throughout the day.
‼️Y.Prigozhin accepted the proposal of President of 🇧🇾 to stop the movement of armed people of the Wagner company on the territory of #Russiapic.twitter.com/Kpf2SW7RNu
మాస్కోలో ఎమర్జెన్సీ
రష్యాలో వాగ్నర్ తిరుగుబాటు తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. మాస్కోలో ఎమర్జెన్సీ విధించారు. అక్కడి ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. మాస్కోలో సోమవారాన్ని ‘నాన్ వర్కింగ్ డే’గా ప్రకటించారు. వాగ్నర్ చీఫ్ ఉద్దేశపూర్వకంగా తిరుగుబాటు చేశారని వార్తల్లో చెప్పబడింది. వాగ్నర్ తిరుగుబాటును ప్రపంచం మొత్తం చూస్తోంది. దీనిపై చాలా దేశాలు ఓ కన్నేసి ఉంచుతున్నాయి.
పుతిన్ స్వయంగా ఈ ముప్పును సృష్టించాడు – జెలెన్స్కీ
రష్యాలో కొనసాగుతున్న ఉద్రిక్తత మధ్య ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ పెద్ద ప్రకటన చేశారు. ఈ ప్రమాదాన్ని పుతిన్ స్వయంగా సృష్టించారని అన్నారు. పుతిన్ మాస్కోలో లేరని అన్నారు. రష్యాపై యుద్ధంలో మన విజయం ఖాయమని జెలెన్స్కీ అన్నారు. భయంతో పుతిన్ ఎక్కడో దాక్కున్నాడని అన్నారు.