యూజర్ల కోసం వాట్సాప్ మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇకపై వీడియో మెసేజ్ పంపే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ సెలక్టెడ్ మొబైల్స్‌కే ఉండగా.. త్వరలో మిగతా మొబైల్స్‌కు అప్ డేట్ అవుతుందని మెటా తెలిపింది.
Whatsapp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో (Whatsapp) కొత్త ఫీచర్ వచ్చింది. ఇన్స్టంట్ వీడియో పంపే వెసులుబాటు కల్పించింది. 60 సెకన్ల వరకు వీడియో పంపించే అవకాశం ఉందని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. దీంతో యూజర్లకు మరో అప్ డేట్ వచ్చింది. ఇదివరకు వీడియో తీసి.. దానిని షేర్ చేసేవారు. ఇప్పుడ యాప్ ఓపెన్ చేసి.. నిమిషం వరకు వీడియో పంపించే వీలుంది.
వాట్సాప్ (Whatsapp) షార్ట్ వీడియో ఫీచర్ ప్రస్తుతం కొన్ని మొబైల్స్‌కు అందుబాటులో ఉంది. ఐ ఫోన్, ఆండ్రాయిడ్ సెలెక్టెడ్ మోడల్స్‌కు ఆప్షన్ వచ్చింది. మిగిలిన మొబైల్స్‌కు త్వరలో అప్ డేట్ ఇస్తారని కంపెనీ చెబుతోంది. హై ఎండ్ మొబైళ్లలో షార్ట్ వీడియో ఆప్షన్ కావాలంటే లేటెస్ట్ వెర్షన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని మెటా సూచిస్తోంది.
టెక్ట్స్ బాక్స్ పక్కన ఉన్న వాయిస్ రికార్డ్ ఆప్షన్ (voice record option) సాయంతో ఫీచర్ ఉపయోగించవచ్చు. రికార్డ్ సింబల్ కొన్ని సెకన్లపాటు హోల్డ్ చేస్తే వీడియో ఆప్షన్‌కు వస్తోంది. దాని సాయంతో 60 సెకన్లపాటు వీడియో (video) రికార్డ్ చేసి పంపించవచ్చు. ఆ వీడియో ప్లే చేస్తే డీఫాల్ట్‌గా ప్లే అవుతుంది. సౌండ్ రాదు.. సౌండ్ రావాలంటే, ఆ వీడియోపై మరోసారి ట్యాప్ చేయాల్సి ఉంటుంది కంపెనీ తెలిపింది.
యూజర్లను (users) దృష్టిలో ఉంచుకొని వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్స్ తీసుకొస్తోంది. టెలిగ్రామ్ యాప్ నుంచి పోటీ ఉండటంతో.. ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తోంది. అందులో భాగంగానే షార్ట్ వీడియో మెసేజ్ ఫీచర్ తీసుకొచ్చింది.