»Viral Mans Hyper Realistic 3d Drawings Will Leave You Rubbing Your Eyes In Disbelief
Rahil Jindran: తన త్రీడీ ఆర్ట్‌తో జనాల మతులు పోగొడుతున్న రహిల్ జింద్రాన్
కేవలం పెన్సిల్, పేపర్ ముక్కతో త్రీడీ ఆర్ట్‌ను రూపొందించే ఆర్టిస్ట్ రహిల్ జింద్రన్ ఆన్లైన్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు లక్షల మందికి పైగా ఫాలోవర్స్ అతని కళను ప్రోత్సహిస్తున్నారు. జింద్రన్ రకరకాలు పెన్సిల్ లను ఉపయోగించి 3D స్కెచ్లను రూపొందిస్తున్నాడు.
Rahil Jindran: ప్రజలను మంత్రముగ్ధులను చేసే కళను నేర్చుకోవడానికి డిగ్రీ లేదా ప్రత్యేక కోర్సు అవసరం లేదు. కేవలం పెన్సిల్, పేపర్ ముక్కతో త్రీడీ ఆర్ట్‌ను రూపొందించే ఆర్టిస్ట్ రహిల్ జింద్రన్ ఆన్లైన్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు లక్షల మందికి పైగా ఫాలోవర్స్ అతని కళను ప్రోత్సహిస్తున్నారు. జింద్రన్ రకరకాలు పెన్సిల్ లను ఉపయోగించి 3D స్కెచ్లను రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో వైరల్ అవుతోంది. “ఆర్ట్ ఈజ్ ఎ పవర్” పేరుతో అతని రీల్ 24 లక్షలకు పైగా లైక్‌లను సంపాదించింది. జింద్రన్ తన అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించాడు. సోషల్ మీడియా వినియోగదారుల నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది.
రాహిల్ ప్రక్రియ తుది ఫలితం చాలా వాస్తవికంగా కనిపిస్తుంది. వీక్షకులను మళ్లీ ప్రయత్నించేలా ప్రేరేపిస్తుంది. వివిధ విషయాలకు సంబంధించిన స్కెచ్‌ల నుండి భారతీయ కరెన్సీ నోట్ల వరకు అతని పనితనం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. పలువురు నెటిజన్లు ‘మైండ్‌బ్లోవింగ్… మీ స్కెచ్‌లు చాలా బాగున్నాయి’ అని కామెంట్లు చేస్తున్నారు. తన అసాధారణ సామర్థ్యాలను నేర్చుకోవడానికి 2017 నుండి 2023 వరకు నిరంతరంగా కృషి చేశానని చెప్పుకొచ్చాడు.