డెక్కన్ కిచెన్ కేసులో దగ్గుబాటి ఫ్యామిలీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందని, JAN 23న కోర్టులో వారు హాజరుకావాలని వార్తలొస్తున్నాయి. ఆ వార్తలపై నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు స్పందించాడు. ‘ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. వ్యక్తిగత హాజరు అవసరం లేదని ఇప్పటికే కోర్టు తెలిపింది. ఇలాంటి బాధ్యతారహితంగా వార్తలు రాసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించాడు.