»Vinod Blames Bandi Sanjay For His Comments On Secretariate
BRS-BJP: బండి సంజయ్ వ్యాఖ్యలపై వినోద్ నిప్పులు
తాము అధికారంలోకి వస్తే సచివాలయం. భవనం పైన డోమ్ ను కూల్చివేశామని వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ పైన రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము అధికారంలోకి వస్తే సచివాలయం. భవనం పైన డోమ్ ను కూల్చివేశామని వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ పైన రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ చిహ్నాలు కలిగిన డోమ్ లను కూల్చివేస్తామని చెప్పినందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం పట్ల అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. బిజెపి నేర్పించే నీతి ఇదేనా అని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు, గుజరాత్ సచివాలయం పైన ఇదే తరహా డోమ్ లు ఉన్న విషయం బండి సంజయ్ కు తెలియదా అని నిలదీశారు.
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ భవనంపై జాతీయ చిహ్నాలతో ఏర్పాటు చేసిన డోమ్ లను కూల్చివేస్తామని ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు సింహాలు ఉన్న
జాతీయ చిహ్నలతో కూడిన చారిత్రాత్మమైన డోమ్ లను కూల్చివేస్తామని చెప్పిన బండి సంజయ్.. తన తప్పును తెలుసుకొని తక్షణమే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా బండి సంజయ్ నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఎలా..?? అని నిలదీశారు.
భారత దేశం వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఉన్న సచివాలయం భవనాలపై జాతీయ చిహ్నాలు ఉన్న డోమ్ లను.. ముఖ్యంగా దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు భవనంపై కూడా తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంపై ఏర్పాటు చేసిన నమూనాలోనే డోమ్ లు ఉన్న విషయాన్ని గమనించాలని సూచించారు.